ETV Bharat / city

రాష్ట్రపతి నేతృత్వంలో గవర్నర్ల సదస్సు..పాల్గొననున్న బిశ్వభూషణ్​ హరిచందన్​ - bishwabhusah delhi visit

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో జరగనున్న గవర్నర్ల సదస్సుకు హాజరు కానున్నారు.

governor delhi tour
governor delhi tour
author img

By

Published : Nov 9, 2021, 1:50 PM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో దిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సుకు గవర్నర్‌ హాజరు కానున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ వేదికగా గురువారం జరగనుంది. విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు.

మూడు రోజుల పర్యటనలో గవర్నర్‌తో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్​పీ సిసోడియా, ఇతర అధికారులు పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో.. గవర్నర్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం గవర్నర్ దిల్లీ నుంచి విజయవాడ రాజ్​భవన్​కు చేరుకుంటారు. మూడు రోజులు ఆయన ఏపీ భవన్​లో బస చేయనున్నారు.

ఇదీ చదవండి:

MEDALS: 11మంది గ్రేహౌండ్స్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.