రాజధాని అంశం... కేంద్ర, రాష్ట్ర, సంయుక్త లిస్టుల్లో ఎక్కడా లేకపోవటంతో గందరగోళం తలెత్తింది. ఈ తరహా అంశాల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు... రాజ్యాంగంలోని 248 అధికరణం ప్రకారం... కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాజధాని అంశాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటే ఈ గందరగోళానికి తెరపడుతుంది. అలా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించే అవకాశముంది. అప్పుడు అలాంటి నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
- గల్లా జయదేవ్, తెదేపా ఎంపీ
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు