విజయవాడలోని గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్లోని ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవటంతో ప్రాణపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫోంను కూడా వినియోగించినట్లు రీజినల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు వెల్లడించారు. విద్యుత్ హై టెన్షన్ వైర్ల స్పార్క్ కిందపడటం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని ఆయన తెలిపారు.
ఇదీచదవండి