ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి భారీగా నీరు చేరుతుండడంతో.. ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పులిచింతలనుంచి.. లక్ష క్యూసెక్కులకుపైగా నీరు దిగువకు వదిలినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాగార్జునసాగన్ నుంచి.. మరో 4 లక్షల క్యూసెక్కులపైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పటంతో ప్రకాశం బ్యారేజీకి మరింత నీటి ఉద్ధృతి పెరగనుంది.
ఇప్పటికే ప్రకాశం బ్యారేజి 3.07 టీఎంసీలతో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో కొన్ని గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రేపు పూర్తి స్థాయిలో బ్యారేజి మొత్తం 70 గేట్లు ఎత్తుతున్నట్లు.. జిల్లా కలెక్టర్ జే.నివాస్ సహా అధికారులు చెప్పటంతో కృష్ణలంక, తారరామ నగర్ రామ లింగేశ్వర సహా ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"మాకు పునరావాసం కల్పించకుండా.. ఎక్కడా తాత్కాలిక ఇళ్ల కేటాయించకుండా వెళ్లమంటే ఎలా? నీటి ఉద్ధృతిని అడ్డుకునేందుకు నిర్మిస్తున్న రిటర్నింగ్ వాలు కోసం.. మా ఇళ్లని కూడా కూల్చారని ఇక్కడే గుడిసెలు వేసుకొని బతుకుతున్నాము. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలి? మాకు మరో మార్గం లేదు. ఈ ఇళ్లల్లోనే చిన్న పిల్లలతో ఉంటున్నాం" -ముంపు గ్రామాల ప్రజల ఆవేదన
కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల ముందస్తు జాగ్రత్త చర్యలు
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చి చేరుతున్న కారణంగా... ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ జె. నివాస్ ఆధ్వర్యంలో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వరద నీరు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఇసుక సంచులను అడ్డు వేయిస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం నుంచి.. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల చేయవచ్చని కలెక్టర్ అంచనా వేశారు. సోమవారం ఉదయం.. 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు ఈ వరద ఉద్ధృతి పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం అవుట్ పాల్, పులిగడ్డ కం పౌండ్ వద్ద ఇసుక బస్తాలు సిద్ధం చేశారన్నారు.
ఇదీ చదవండి:
Family Suicide: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి.. దంపతుల ఆత్మహత్య!