ETV Bharat / city

'ఎడారిలో ఒయాసిస్సు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామోజీరావు

author img

By

Published : Aug 27, 2019, 4:47 PM IST

Updated : Aug 27, 2019, 5:47 PM IST

అన్నదాత కార్యనిర్వాహక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ రచించిన "ఎడారిలో ఒయాసిస్సు-ఇజ్రాయెల్‌ వ్యవసాయం" పుస్తకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి రామోజీరావు ముందుమాట రాశారు.

eenadu-group-chairman-ramoji-rao-launch-yedarilo-oasis-book-written-by-amirneni-harikrishna

'ఎడారిలో ఒయాసిస్సు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామోజీరావు

వ్యవసాయం, నీటిపారుదల యాజమాన్యంలో ఇజ్రాయెల్‌ సాధించిన విజయాలపై అన్నదాత కార్యనిర్వాహక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ రచించిన పుస్తకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆవిష్కరించారు. ఇజ్రాయెల్‌ చరిత్ర, ఆవిర్భావంతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో ఈ ఎడారి దేశం అనన్యసామాన్యమైన ప్రగతిని అందుకున్న తీరును రచయిత ఈ పుస్తకంలో వివరించారు.

భారత్‌-ఇజ్రాయెల్‌ సంబంధాల్లో పొద్దు పొడిచిన నవశకం, అందుకు రెండు దేశాల ప్రధానులు మోదీ-నెతన్యాహుల మధ్య పెనవేసుకున్న స్నేహబంధం గురించి రచయిత పుస్తకంలో ప్రస్తావించారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు-ప్రదర్శనలో భాగంగా ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ 2015లో దేశంలోని ఆరుగురు సీనియర్‌ పాత్రికేయులను ఎంపిక చేసి అధ్యయనం చేసేందుకు తమ దేశానికి ఆహ్వానించింది. ఈనాడు గ్రూపు తరఫున ఆ బృంద సభ్యుడిగా ఇజ్రాయెల్‌ సందర్శించిన హరికృష్ణ.. అక్కడి వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాల స్థితిగతులను పరిశీలించి "ఎడారిలో ఒయాసిస్సు- ఇజ్రాయెల్‌ వ్యవసాయం" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి రామోజీరావు ముందుమాట రాశారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈనాడు ఎండీ కిరణ్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ డి.ఎన్‌.ప్రసాద్‌, పుస్తక రచయిత అమిర్నేని హరికృష్ణ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మర(ణ)మగ్గంపై నేతన్న... ఆదుకునేదెవరన్న?

Intro:Body:Conclusion:
Last Updated : Aug 27, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.