ETV Bharat / city

Marriage with Goat: ఈ విచిత్రం చూశారా.. మేకతో యువకుడి పెళ్లి..

Crazy marriage : ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా ఏదో ఒక చోట ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో వింత పోకడలకు పోతున్నారు. జాతకం ప్రకారం ఓ యువకుడి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని.. దోష నివారణ కోసం మేకతో పెళ్లి జరిపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది.

Crazy marriage with Goat
Crazy marriage with Goat
author img

By

Published : Apr 3, 2022, 10:52 AM IST

Updated : Apr 3, 2022, 11:07 AM IST

Crazy marriage with Goat: కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు. అతడి జాతకాన్ని పరిశీలించేందుకు జోతిష్యుడిని సంప్రదించారు. ఆ కుర్రాడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని ఆయన వారికి వివరించారు. ఆ దోషం పోవాలంటే మేకను మనువాడితే సరిపోతుందని సూచించాడు. దీంతో జాతకాలపై నమ్మకమున్న ఆ యువకుడు మేకతో వివాహానికి రెడీ అయిపోయాడు.

నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో ఈ కుర్రాడికి మేకతో పెళ్లి జరిగింది. ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు. మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు. స్థానికులు మాత్రం మేకతో పెళ్లా అంటూ ఆశ్చర్యపోయారు.

ఈ విచిత్రం చూశారా.. మేకతో యువకుడి పెళ్లి..

ఇదీ చదవండి : Honey Trap: ఆన్​లైన్​లో 'వలపు వల'.. ఉద్యోగులకు హెచ్చరికలు!

Last Updated : Apr 3, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.