కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 సాంకేతిక కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య నిపుణులతో పాటు మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కూడిన సాంకేతిక కమిటీని పునర్నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 'పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. శ్రీనాథరెడ్డి నేతృత్వంలో 13 మంది వైద్య నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని నియమించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, నిరోధక చర్యలు, కొవిడ్-19 కార్యాచరణపై ఎప్పటికప్పుడు 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' సూచనలతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇచ్చే నిబంధనల్ని, మార్గదర్శకాలను పాటించేలా కమిటీకి నిర్దేశించారు. కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడటంతో పాటు ఆస్పత్రుల్లో చికిత్సకు కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటు ఇతర సాంకేతిక అంశాలను పర్యవేక్షించాల్సిందిగా కమిటీకి దిశానిర్దేశం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైద్య, విద్యా సంచాలకుడు ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించి ఎప్పటికప్పుడు అంశాలను ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.
కొవిడ్-19 సాంకేతిక కమిటీలో మార్పులు - కొవిడ్-19 సాంకేతిక కమిటీలో మార్పులు
కొవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 సాంకేతిక కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో 13 మంది వైద్య నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.