రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ తాజాగా 3,503 మందికి కోవిడ్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 7,89,553కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 28 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,481 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 7,49,676 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 33,396 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 69,095 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు మెుత్తం 71.96 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసులు...
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 524 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 459, తూర్పుగోదావరి 457, కృష్ణా 398, గుంటూరు 387, ప్రకాశం 308, విశాఖపట్నం 240, కడప 190, నెల్లూరు 182, అనంతపురం 123, శ్రీకాకుళం 94, విజయనగరం 93, కర్నూలులో 48 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు...
కృష్ణా 4, ప్రకాశం 4, చిత్తూరు 4, కడప 4, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 2, నెల్లూరు 1, శ్రీకాకుళం 1, విశాఖలో ఒకరు చొప్పున మృతి చెందారు.