రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పడకేసిందని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వైకాపా ప్రభుత్వం శీతకన్ను వేస్తోందని ఆరోపించారు. 2022 లోగా పూర్తి చేస్తామన్న పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టడంలోనూ ముఖ్యమంత్రి జగన్ విఫలయ్యారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటివరకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు పురోగతి, పునరావాసం సహా కీలకాంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు పునరావాసానికి సంబంధించిన పనులు 20.19 శాతం మాత్రమే జరిగాయని, పునరావాస కాలనీలు, వాటిలో వసతుల కల్పన, ప్రత్యామ్నాయ భూసేకరణ వంటి అన్ని అంశాల్లోనూ వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని శైలజానాథ్ ఆక్షేపించారు. తక్షణమే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి :