Action on Fake jobs in APSRTC: ఏపీఎస్ఆర్టీసీ పేరిట నకిలీ మెయిల్స్ సృష్టించి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నవీన్‌కుమార్ అనే వ్యక్తిపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ పేరిట నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు సృష్టించి కొంతకాలంగా నవీన్ కుమార్ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, మదనపల్లి, పలమనేరు డిపోల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
మోసపూరిత దళారులను నమ్మవద్దు: ఆర్టీసీ
మోసపూరిత వ్యవహారంపై ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. నవీన్ కుమార్ అనే వ్యక్తి నకిలీ ఈ మెయిల్స్ ద్వారా నిరుద్యోగులు, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. నవీన్ కుమార్‌తో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆర్టీసీలో ఉద్యోగాలు దినపత్రిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే భర్తీ చేస్తామని.. మోసపూరిత దళారులను నమ్మవద్దని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆర్టీసీ కోరింది.
ఇదీ చదవండి:
'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్