CM KCR Jangaon Tour Speech: దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల బోర్లు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం అడ్డగోలుగా డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసిందని ఆరోపించారు. జనగామలో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు.
CM kcr fires on Central Government: తాము రైతుబంధు ఇస్తుంటే.. కేంద్రం రైతుల పెట్టుబడి ధరలు పెంచుతోందని మండిపడ్డారు. విద్యుత్ మోటార్లు పెట్టం.. అవసరమైతే దిల్లీకి వచ్చి పోట్లాడుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, మెడికల్ కళాశాల ఇవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా పర్లేదు.. దేశం మిమ్మల్ని తరమడం ఖాయమని పేర్కొన్నారు. జాతీయ హోదా, మెడికల్ కళాశాలలు, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేవాళ్లనే తెచ్చుకుంటామని అన్నారు.
''ధాన్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. మోదీ ప్రభుత్వం రైతుల వెంటపడింది. కుంభకోణాలు చేసిన వారికి విమాన టిక్కట్లు ఇచ్చి విదేశాలకు పంపారు. మా ప్రాణం పోయినా.. మోటార్లకు మీటర్లు పెట్టం అంటే పెట్టం. కేంద్రంపై తిరగబడతాం.. అవసరమైతే దిల్లీ వెళ్లి కొట్లాడతాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అందరం కొట్లాడతాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం. ప్రజలు దీవిస్తే దిల్లీ కోటలు బద్దలుకొడతా.. జాగ్రత్త మోదీ.. ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు. భాజపా వాళ్లను మేం టచ్ చేయం. మమ్మల్ని టచ్ చేస్తే నశం చేస్తం. -కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: