తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగుయువత ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మందిని చంద్రబాబు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఆధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి కి చెందిన రాగుల ఆనంద్‌గౌడ్, గుంటూరు చెందిన యెల్లావుల అశోక్ యాదవ్, అమలాపురానికి చెందిన చెరుకూరి సాయిరామ్, యలమంచిలికి చెందిన ధర్మారెడ్డి నాయుడు, విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్, హిందూపురానికి చెందిన గడుపుటి నారాయణస్వామి, మాడుగులకు చెందిన కర్రి సాయికృష్ణ, కోవూరుకు చెందిన పోల్లంరెడ్డి దినేశ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వీరంతా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో పనిచేయనున్నారు.
ఇదీ చదవండి: