రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో రూ. 6 వేల 421 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. 2021-22 ఏడాది వార్షిక ప్రణాళికను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ఆమోదించింది. 2019-20 ఏడాదిలో కేవలం రూ. 267 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. సీఎం జగన్ వినతితో అదే ఏడాది కేటాయింపులను సవరించి పెంచింది.
2019-20 ఏడాదిలో రాష్ట్రానికి రూ.1830 కోట్లు కేటాయించారు. 2020-21లో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 2 వేల 702 కోట్లను కేంద్రం కేటాయించింది. 2021-22 ఏడాదికి రాష్ట్రానికి మూడింతలు కేటాయింపులు జరిపింది. ఈ ప్రణాళిక కింద ప్రతిపాదించిన పనులను రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బి విభాగానికి చెందిన జాతీయ రహదారుల విభాగం తీసుకుంటుంది. జాతీయ రహదారులకు పెద్దఎత్తున నిధులు కేటాయింపుతో భూ సేకరణ సహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి..