ఆషాడమాసంలో ఇంద్రకీలాద్రి.. పవిత్ర సారె సమర్పణలతో కళకళలాడుతోంది. ఈనెల 3వ తేదీన ఆషాడ సారె కార్యక్రమం ప్రారంభించగా... దూరప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతోపాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకుని... పవిత్ర సారెను సమర్పిస్తున్నారు.
మహా మండపంలో 'ఆషాడ సారె'
ఆషాడ మాసంలో నిర్వహించే 'పవిత్ర సారె' కార్యక్రమం ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతోంది. మహామండపం 6వ అంతస్తులో ఆషాడ సారె సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలో అమ్మవారికి సారె చూపించి అనంతరం 6వ అంతస్తులో సమర్పిస్తున్నారు. పట్టు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండివంటకాలతో భక్తులు అమ్మవారికి సారె పెడుతున్నారు.
అమ్మవారికి సారె సమర్పించిన ఆలయ ఈఓ కోటేశ్వరమ్మ
ఈ నెల 3న ఈవో కోటేశ్వరమ్మ దంపతులు అమ్మవారికి సారె సమర్పించి 'ఆషాడ సారె' కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు నుంచి అమ్మవారికి సారె సమర్పించేందుకు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి భక్తులు వచ్చి సమర్పించుకుంటున్నారు.
అమ్మవారికి ప్రముఖులు 'ఆషాడ సారె' సమర్పణ
అమ్మవారికి ప్రముఖులు సైతం 'ఆషాడ సారె' సమర్పిస్తున్నారు. ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత అమ్మవారిని దర్శించుకుని 'పవిత్ర సారె' సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ... చిరంజీవి సతీమణి, కుమార్తె సుస్మితకు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మూడు రోజుల పాటు 'శాకంబరి' ఉత్సవాలు
ఆషాడ మాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలను ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. శాకాంబరి ఉత్సవాల ప్రారంభం రోజునే తెలంగాణ రాష్ట్రం తరఫున అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఈ నెల 16 వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తున్నారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ ద్వారాలను తెరవనున్నారు.
ఇదీ చదవండి :