సహకర బ్యాంకుల వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టరు ఆర్.ఎస్.రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను రైతులకు మరింత చేరువ చేసేందుకు..,నష్టాలు లేకుండా లాభాల దిశగా పనిచేసేందుకు పలు సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయన్నారు. విజయవాడలో రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం నిర్వహించిన తొమ్మిదో రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పది ప్రధాన డిమాండ్లపై ఉద్యోగుల సంఘం నేతలు సమావేశంలో చర్చించారు.
ఉద్యోగుల సంఘం నేతల ప్రధాన డిమాండ్లు
- సహకార రంగంలో రెండంచెల విధానాన్ని తీసుకురావాలి.
- 1960 ల్లో వాణిజ్య బ్యాంకుల సిబ్బంది కంటే ఎక్కువ వేతనాలు పొందిన డీసీసీబీ ఉద్యోగులు ఇప్పుడు అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నారని..వీరికీ ఐబీఏ స్కేలు అమలు చేయాలి.
- అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో ఉద్యోగుల పదోన్నతులపై ఓ విధానం రూపొందించాలి.
- ఇంఛార్జ్ క్యాషియర్లుగా పనిచేస్తోన్న సబార్డినేట్ సిబ్బందికి అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
- కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహించిన వారికి ఐబీఏ ఉత్తర్వుల ప్రకారం ప్రయోజనాలు కల్పించాలి.
- డీసీసీబీల్లో చీఫ్ మేనేజరు పోస్టు ప్రవేశపెట్టాలి.
ఇదీచదవండి 'అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంకు లేదా?'