CM JAGAN INAUGURATES OXYGEN PLANTS: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 133 ఆక్సిజన్ ప్లాంట్లను.. ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 426 కోట్ల వ్యయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్ల ద్వారా ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.
సిలిండర్లు సైతం..
అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపే అవకాశం ఉంటుంది. ఒక నిమిషంలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఆక్సిజన్ ఈ ప్లాంట్లనుంచి తయారవుతుంది. మరో 11 ప్లాంట్ల పనులు జరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ, రవాణా కోసం 20 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్ ఐఎస్ఓ గుర్తింపు ఉన్న ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఇదీ చదవండి: PROTEST ON PROBATION: ప్రొబేషన్ పోరాటం.. నేడు నుంచి ఉద్యోగుల విధుల బహిష్కరణ