ETV Bharat / city

Buggana:'పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించా' - ఆర్థిక మంత్రిని కలిసిన బుగ్గన

పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించా

author img

By

Published : Aug 31, 2021, 5:49 PM IST

Updated : Aug 31, 2021, 6:39 PM IST

17:44 August 31

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన బుగ్గన

పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించా

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు.

"అన్‌రాక్ కంపెనీ ఐసీజేలో వేసిన కేసుపై కేంద్ర మంత్రితో చర్చించా. అన్‌రాక్ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. కేసు పరిష్కారమైతే రాష్ట్రానికి పెద్ద కంపెనీ వస్తుంది. 2008లో అప్పటి సర్కారు అన్‌రాక్‌కు బాక్సైట్ సరఫరా చేయలేకపోయింది. ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించా. ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటుకు రాష్ట్రం ఇప్పటికే స్థలం కేటాయించింది. ఏపీలో విద్య, నైపుణ్య శిక్షణ సంస్థలు ఎక్కువ ఉండాలనేది సీఎం ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై తెదేపాది అనవసర రాద్ధాంతం. వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకే అప్పులు తెచ్చాం" - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి:

AP - TS Water Disputes: రేపే 2 బోర్డుల కీలక భేటీ.. నిలదీసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధం!

Last Updated : Aug 31, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.