మత కల్లోలాలు రెచ్చగొట్టి.. గొడవలు రేపే కుట్రలో భాగంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. దేవుడి డబ్బు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం రహస్య అజెండాలో భాగమేనని విమర్శించారు. మంత్రులు చేసే వ్యాఖ్యలే ఈ అనుమానాలకు తావిస్తోందన్న అమర్నాథ్ రెడ్డి... తప్పించుకోవాలని చూడటం, తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం కఠినంగా ఉంటే ఈ తరహా దాడులు ఖచ్చితంగా జరగవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్