ETV Bharat / city

scholorships: అర్హత గల ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులకు స్కాలర్​షిప్ - సాంకేతిక విద్య

అర్హత గల ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులకు నెలకు రూ.12,400 స్కాలర్​షిప్ అందించేందుకు ఐఏసీటీఈ కొత్త స్కాలర్​షిప్​ను ప్రవేశపెట్టింది. ఈ సహాయం అందుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

అర్హత గల ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులకు స్కాలర్​షిప్

author img

By

Published : Oct 11, 2021, 3:11 PM IST

Updated : Oct 11, 2021, 3:34 PM IST

ఆర్థిక స్థోమత లేక ఉన్నతవిద్యకు దూరమవుతున్న ప్రతిభ గల విద్యార్థినీ విద్యార్థులు పీజీ చదివేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించేలా ఆల్​ ఇండియా సెంటర్​ ఫర్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ (ఏఐసీటీఈ) ఇప్పుడు స్కాలర్​షిప్​ను ప్రవేశపెట్టింది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థలు, యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.

ఎంపికైన విద్యార్థులకు ఏఐసీటీఈ రెండేళ్ల పాటు ప్రతినెలా రూ.12,400 స్కాలర్​షిప్​ అందజేస్తుంది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​ పొందేందుకు అర్హులు. అయితే వారు తప్పనిసరిగా GATE, CEED, GPAT వంటివి క్వాలిఫై అయి​ ఉండాలి.

అభ్యర్థులు ఫుట్​ టైమ్​ రీసెర్చ్​ స్కాలర్​గా ప్రవేశం పొందాలి. పార్ట్​టైమ్​ విధానంలో పీజీ చేసే వారు దరఖాస్తుకు అనర్హులు. ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ చేస్తున్న విద్యార్థులు చివరి ఏడాది.. అంటే 9వ సెమిస్టర్ నుంచి స్కాలర్‌షిప్‌కు అర్హులు. అయితే వారు మునుపటి ఏడాదిలో 8 లేదా అంతకంటే ఎక్కువ CGPA స్కోరు సాధించి ఉండాలి. స్కాలర్‌షిప్ గరిష్టంగా 24 నెలల పాటు లేదా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.

ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రిసెర్చ్ కార్యకలాపాల్లో పాల్గొనాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేయడానికి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్ లేని దరఖాస్తులను స్వీకరించమని ఏఐసీటీఈ నోటిఫికేషన్​లో పేర్కొంది.

అర్హత గల విద్యార్థులు ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్ https://pgscholarship.aicte-india.org/ లో.. దరఖాస్తులను సమర్పించాలి. విదేశీ విద్యార్థులు, స్పాన్సర్డ్​ అభ్యర్థులు, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన వారు స్కాలర్‌షిప్‌కు అనర్హులు.

ఇదీ చదవండి :

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు​

Last Updated : Oct 11, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.