ETV Bharat / city

దుర్గగుడి అవకతవకలపై ప్రభుత్వానికి అనిశా నివేదిక.. ఈవో గురించి ఏం చెప్పారంటే? - విజయవాడ వార్తలు

విజయవాడ దుర్గగుడి సిబ్బంది.... తమ ఈవో సురేష్‌బాబు వ్యవహారశైలిపై అ.ని.శా. ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాల్లో అవకతవకలంటూ స్వచ్ఛందంగా వాంగ్మూలమిచ్చారు. ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అ.ని.శా. ఈ విషయాన్ని పొందుపర్చింది. గత నెల 5 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై సునిశిత పరిశీలన చేసిన తర్వాత అ.ని.శా. రూపొందించిన నివేదికలోని అంశాలు కాస్త ఆలస్యంగా వెలుగుచూశాయి.

Acb Priliminary Report On Indrakeladri issue
దుర్గగుడి ఈవో సురేష్‌బాబు వైఫల్యాల ప్రస్తావన
author img

By

Published : Mar 3, 2021, 8:58 AM IST

గత నెలలో ఇంద్రకీలాద్రిపై వరుసగా ఐదు రోజుల పాటు 8 విభాగాలను జల్లెడపట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు..... పలు అవకతవకలను గుర్తించి.... వాటిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. పరిపాలనాపరంగా ఈవో సురేష్‌బాబు వైఫల్యాలను నివేదికలో బయటపెట్టారు. ఎలాంటి టెండర్లు పిలవకుండానే...... గుంటూరు జిల్లాకు చెందిన సహకారేతర డెయిరీ సంగం నుంచి.... ఐదేళ్ల పాటు నెయ్యి కొనుగోలు చేశారని.... ఆడిట్ విభాగం అభ్యంతరంతో అప్పుడు టెండర్లు పిలిచారని అ.ని.శా పేర్కొంది. హౌస్‌కీపింగ్, పారిశుద్ధ్య సేవలకు టెండర్లు పిలిచిన అధికారులు....ఎల్1ను కాదని, ఎల్3కి కట్టబెట్టారని వివరించింది. టెండర్ పత్రంలో పేర్కొనని నిబంధనను సాకుగా చూపి ఎల్1ను తిరస్కరించారని..... ఇది సీవీసీ మార్గదర్శకాలకు విరుద్ధమని.... ఎల్1కు తగిన అర్హతలు లేవనుకుంటే తిరిగి టెండర్లకు వెళ్లాలని అ.ని.శా వ్యాఖ్యానించింది.

ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా మ్యాక్స్ సంస్థ ఎంపిక

2019 సెప్టెంబర్ నుంచి 2020 ఆగష్టు కాలానికి..... ఆలయ భద్రత కోసం మ్యాక్స్ డిటెక్టివ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఈవో ఎంపిక చేశారని అ.ని.శా. తన నివేదికలో పేర్కొంది. అనంతరం.... మరో ఏడాది పొడిగింపునకు సంస్థ కోరినా.... దేవదాయశాఖ కమిషనర్ తిరస్కరించి... కొత్తగా టెండర్లను పిలవాలని ఈవోను ఆదేశించినట్టు అ.ని.శా. వివరించింది. ఈ మేరకు కొత్త టెండర్లు పిలిచాక..... మ్యాక్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలని కమిషనర్‌కు ఈవో సిఫార్సు చేయగా.... దీనిపై నిర్ణయం వెలువడక ముందే .... కమిషనర్ ఆమోదించకుండానే ఏజెన్సీకి సొమ్ము చెల్లించారని అ.ని.శా. ఆక్షేపించింది. కమిషనర్‌, స్టేట్ ఆడిట్ సంచాలకుడి మార్గదర్శకాలను ఉల్లంఘించి టెండర్లు, కొటేషన్లు, సరకుల కొనుగోళ్ల టెండర్లను ఖరారు చేశారని.... వీటి బిల్లులను ఆడిట్‌ చేయించి చెల్లించాలని నిబంధనలు ఉన్నా...... వాటిని పట్టించుకోలేదని అ.ని.శా. తన నివేదికలో పేర్కొంది.

ఆస్తుల రిజిస్టర్‌ అప్‌డేట్ చేయలేదు:అనిశా

మూడేళ్లకోసారి ఆస్తుల రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశాలున్నా.... ఈవో దీన్ని నిర్వర్తించలేదని అ.ని.శా. వివరించింది. 2010 నుంచి ఇది అప్‌డేట్ అవలేదని గుర్తించింది. ఆలయ భూముల వివరాలు నమోదు చేసే 8ఏ రిజిస్టర్ నిర్వహణ సరిగ్గా లేదని ఆక్షేపించింది. అన్నదానం స్టోర్స్‌ నగదు రిజిష్టర్‌లో ఫిబ్రవరి 11 నుంచి ఈవో కౌంటర్‌ సంతకం చేయలేదని వివరించింది. దర్శనం టిక్కెట్ కౌంటర్లలోనూ అ.ని.శా. లోపాలను గుర్తించింది. ఐదు హారతి టిక్కెట్లను డబ్బులు తీసుకోకుండానే ఇవ్వడం వల్ల ఆర్జిత సేవా కౌంటర్‌లో రికార్డ్ అసిస్టెంట్ వద్ద రెండున్నర వేల రూపాయలు తక్కువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రతి డీసీఆర్ రశీదుపై సూపరింటెడెంట్ సంతకం చేయట్లేదని.... స్కానింగ్ పాయింట్ వద్ద ఆన్‌లైన్ టిక్కెట్లను సరిగ్గా స్కాన్ చేయట్లేదని అ.ని.శా పేర్కొంది.

చీరల గోదాము, కౌంటర్లలో లోసుగులు

చీరల గోదాము, కౌంటర్లలో అనేక లొసుగులను అ.ని.శా అధికారులు గుర్తించారు. పదిన్నర వేల రూపాయల విలువైన రెండు పట్టుచీరలు కనిపించడం లేదని.... మరో 2 విలువైన పట్టుచీరలను ఓ వస్త్రంలో చుట్టి... ఆలయంలోని చీరల విక్రయాల కౌంటర్‌లో కాకుండా ఓ ఇనుప బీరువాలో వేరుగా పెట్టారని అ.ని.శా వివరించింది. చీరలు కొనుగోలు చేసిన భక్తులకు సరిగ్గా రశీదులు ఇవ్వకపోతుండటం వల్ల... 1336 అసలు బిల్లులు డెస్క్‌లో ఉన్నాయని గుర్తించింది. అన్నదానం స్టోర్లలో సరకుల రిజిష్టర్‌.... వంటమనిషి వద్ద ఉందని... ఇందులో ఎంత సరకులు తీసుకున్నారో సంతకం లేదని గుర్తించింది. వీటిని అందజేసిన ఉద్యోగి .... ఎంత పరిమాణంలో ఇస్తున్నారో వాటి ధర ఎంతో ఫిబ్రవరి 2 నుంచి వివరాలు నమోదు చేయలేదని పేర్కొంది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ పాల సరఫరా కాంట్రాక్ట్ సంగం డెయిరీకి దక్కగా.... ధరల పెంపును ఆ సంస్థ అడిగిన తర్వాత 2019 నవంబర్‌లో ఒప్పందాన్ని దేవస్థానం రద్దు చేసినట్టు అ.ని.శా. గుర్తించింది. బిడ్డర్‌కు చెందిన 2లక్షల డిపాజిట్‌ను మాత్రం తిరిగివ్వలేదని పేర్కొంది..

విరాళాలను ఎఫ్‌డీ చేయలేదని గుర్తింపు

అన్నదానం విభాగానికి వచ్చే విరాళాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయాల్సి ఉన్నా..... ఆలయాధికారులు దీన్ని ఉల్లంఘించారని..... 2016-17లో వచ్చిన 54లక్షల 31వేల రూపాయల విరాళాలను ఎఫ్​డీ చేయలేదని అ.ని.శా. గుర్తించింది. 5వేల లోపు విరాళాలను కరెంట్ ఖాతాలో జమ చేశారని.... నిబంధనల ప్రకారం ఎఫ్​డీపై వచ్చే వడ్డీని మాత్రమే అన్నదానం కోసం వెచ్చించాల్సి ఉండగా.... దీన్ని అతిక్రమించారని పేర్కొంది. ఇలా.. ఇంద్రకీలాద్రిపై వివిధ విభాగాల్లోని గుర్తించిన అవకతవకలను అ.ని.శా తన ప్రాథమిక నివేదికలో వివరించింది.

ఇదీ చదవండి:
గెలుపు పై నమ్మకమే ఉంటే దౌర్జన్యాలు ఎందుకు..? సీపీఐ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.