- సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు 4వారాల పాటు స్టే విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం'
రాజధాని అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ముమ్మర విచారణ జరిపింది. గంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐడీ విచారణకు పలువురు ఎస్సీ రైతులు హాజరయ్యారు. తమ భూములను రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు సీబీఐ అధికారులకు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై.. నేడు సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసును.. కోర్టు ఈ నెల 26కు వాయిదా వేయగా.. రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22కు వాయిదా పడింది. దాల్మియా కేసు ఏప్రిల్ 9కి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'
ప్రివిలేజ్ మోషన్ నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. శాసనసభ, ఎమ్మెల్యేలపై అపారమైన గౌరవం ఉందన్న ఆయన...తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బంగాల్లో నిష్పాక్షిక ఎన్నికలు కష్టమే!'
బంగాల్లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా లేవని తృణమూల్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల దూరంలోనే రాష్ట్రబలగాలు ఉండాలని ఈసీ నిర్ణయించిందన్న వార్తలను ప్రస్తావిస్తూ... ఎన్నికల సంఘానికి నిరసన తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రైతు నిరసనలపై దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం'
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల్ని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ప్రేరేపిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలిపింది. వీటి నుంచి అన్నదాతలు బయటపడి.. కేంద్రంతో చర్చలు జరపాలని సూచించింది. రైతులు, కేంద్రం కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ట్రంప్ విగ్రహానికి 'పంచ్' దెబ్బ..!
ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. టెక్సాస్ లాయిస్ టుస్సాడ్స్ వాక్స్వర్క్స్లోని ఆయన మైనపు విగ్రహంపై పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. దీంతో విగ్రహం మొహంపై గాట్లుపడ్డాయి. కస్టమర్ల దాడి నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు వేరే చోటకు తరలించారు నిర్వాహకులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 35% వృద్ధి!
ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న వేళ.. ప్రజలు ఆభరణాల కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని ఇండియా రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2020-21లో బంగారు ఆభరణాలకు 35 శాతం గిరాకీ పెరగొచ్చని తన నివేదికలో వెల్లడించింది. అదే విధంగా పసిడి ధరలు తగ్గుతుండటమూ ఒక కారణంగా పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఫీజులో కోత
భారత్-ఇంగ్లాండ్ నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాజమౌళి కొత్త ప్లాన్!
'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన ఓ విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆలియా, అజయ్ దేవగణ్‌లపై మరిన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.