రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరో 104 మంది బలయ్యారు. కరోనా నుంచి మరో 20,109 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,237 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 91,629 కరోనా పరీక్షలు చేయగా.. 18,767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,887 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు-2,323, పశ్చిమ గోదావరి-1,972, అనంతపురం-1,846, విశాఖ-1,668, గుంటూరు జిల్లాలో 1,249 కేసుల చొప్పున నమోదయ్యాయి.
కరోనాతో చిత్తూరు జిల్లాలో 15 మృతి చెందగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది మృతి చనిపోయారు. విజయనగరం జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 9 మంది, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 8 మంది చొప్పున వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి: ఖాళీ రెమ్‌డెసివిర్ సీసాల్లో.. సెలైన్ నీళ్లు !