చిత్తూరు జిల్లా తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా.. మధ్యాహ్నం ఆలయంలోని వేద ఆశీర్వాద మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం వేద పారాయణం, ఊరేగింపు నిర్వహించారు. కరోనా ప్రభావంతో.. ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా చేపట్టారు.
ఇదీ చదవండి: