TTD Pediatric Super Speciality Hospital: తితిదే నిర్వహణలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ద్వారా పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ప్రారంభించిన 3నెలల్లోనే 150మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారని వివరించారు. కాన్సర్ వ్యాధి నిపుణులు, ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడుతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. వైద్యశాలలో వార్డులు, ఐసీయూ, వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు, యంత్రాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన చికిత్స ఉచితంగా అందడం అభినందనీయం అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్నారుల క్యాన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేస్తామని తితిదే ఛైర్మన్ తెలిపారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని వ్యాధులకు ఓకే చోట సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేలా ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి : Mysterious Deaths: జంగారెడ్డిగూడెంలో మిస్టరీ.. రెండు రోజుల్లో 15మంది మృతి.. అసలేం జరిగింది..?