తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు.. ప్రచారం ముగిసింది. రాత్రి 7 గంటలతో.. ప్రచార గడువు ముగిసింది. చివరి రోజు సైతం ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప ఎన్నిక పోరును మరింత వేడెక్కించాయి.
ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. ఎల్లుండి పోలింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత కోడ్ ఉల్లంఘనలు జరగకుండా.. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
తిరుపతి ఉపఎన్నికకు ఎల్లుండి పోలింగ్, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ కోసం 2,440 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: