ETV Bharat / city

శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు విడుదల - తిరుమల తాజా వార్తలు

శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన ఆన్​లైన్ కోటను తితిదే వైబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు. టిక్కెట్లు పొందిన భక్తుల వివరాలను సేవ జరిగే సమయంలో స్వామివారి ముందు ఉంచి ఆశీస్సులు అందజేశారు. సేవా టిక్కెట్లు పొందిన భక్తుల పేరిట సేవలను నిర్వహిస్తారు.

virtual seva tickets
virtual seva tickets
author img

By

Published : Nov 28, 2020, 6:01 AM IST

తిరుమల శ్రీవారి వర్చువల్‌ సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ కోటాను అందుబాటులో ఉంచింది. రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. టిక్కెట్లు పొందిన భక్తుల వివరాలను సేవ జరిగే సమయంలో స్వామివారి ముందు ఉంచి ఆశీస్సులు అందజేశారు. సేవా టిక్కెట్లు పొందిన భక్తుల పేరిట సేవలను నిర్వహిస్తారు.

శ్రీవారికి జరిగే సేవలను తితిదే ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి వర్చువల్‌ సేవా టిక్కెట్టుకు అనుసంధానంగా ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి : నేడు తితిదే పాలకమండలి భేటీ...ఆర్థిక పరిస్థితులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.