తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. భాజపా జాతీయస్థాయి నేతలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకాపా ఆగడాలకు ధీటైన సమాధానం చెప్పాలన్న పవన్.. తిరుపతిలో విజయం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. జనసేన పోటీచేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమని భావించామన్నారు.

ఇదీ చదవండి: పింగళికి భారతరత్న ప్రకటించడం సముచితం: సీఎం జగన్