రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన భూమన - mla bhumana visit to tirupati ruya hospital
తిరుపతిలోని రుయా ఆసుపత్రిని ప్రైవేటు ఆసుపత్రికి దీటుగా మార్చే తలంపుతో సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన... రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేటు ల్యాబ్‌కు ఎందుకు బిల్లులు చెల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏనుగు దాడిలో పాడి దూడ మృతిBody:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గాంధీనగర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో గ్రామానికి చెందిన టి. లక్ష్మీ నారాయణ అనే రైతు పొలం వద్ద కట్టేసిన లేగదుడను ఒంటరి ఏనుగు దాడి చేసి చంపేసింది. దీంతో పాటు అక్కడే కట్టి ఉన్న ఆవుల పై దాడి చేయడంతో అవి తాళ్లు తెంపుకొని అడవిలోకి పరుగు తీశాయి. ఉదయాన్నే గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తుండగా ఒక్కసారిగా అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామస్తులు చనిపోయిన లేగదూడ మృతదేహాన్ని తీసుకొని పలమనేరు లోని అటవీ శాఖ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. నిత్యం ఏనుగుల దాడులతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి ఉందని ఇప్పటికే ఏనుగుల దాడిలో వల్ల గ్రామంలో ఏ పంట సాగు చేయకుండా మంచి మంచి వ్యవసాయ భూములను బీడు భూములుగా వదిలేసా మని, మూగజీవాలకు కూడా రక్షణ లేకపోతే ఎలాగని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల రాకను అడ్డుకునేందుకు శాశ్వత చర్యలు తీసుకునేంత వరకు ధర్నా ఆపే ప్రసక్తే లేదని జాతీయ రహదారిపై కూర్చుండిపోయారు. ఏనుగుల బారినుండి తమ ప్రాణాలను, పంటలను, పశువులను కాపాడలంటూ అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సుమారు ఒక కిలో మీటర్ కు పైగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తాము కూడా కృషి చేస్తామని ధర్నా విరమించాలని సూచించడంతో రైతులు శాంతించారు.Conclusion:రోషన్ ఈటీవీ భారత్ పలమనేరు 7993300491