హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సంజయ్ కుందు..ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి తిరుమలలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తితిదే సీవీఎస్‌వో గోపీనాథ్ జెట్టి వారికి శ్రీవారి ఆలయం, ప్రసాదాల తయారీ, విక్రయ ప్రాంగణంలో తీసుకునే చర్యలపై వివరించారు. కమాండ్ కంట్రోల్‌రూమ్‌ను సందర్శించి...ఇతర భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.
నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రంలో తితిదే అనుసరిస్తున్న విధానాలపై ఆవగాహన కోసం వచ్చినట్లు సంజయ్ తెలిపారు. తితిదే అమలు చేస్తున్న భద్రతా చర్యలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. తితిదే ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో శక్తి పీఠాలు, సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయని.. తితిదే అనుసరిస్తున్న విధానాలను తమ ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీచదవండి
అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు