ETV Bharat / city

తిరుపతికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో క్యూలైన్లు, కంపార్టుమెంట్లు కిటకిటలాడుతున్నాయి.వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనూహ్య రద్దీ నెలకొనడంతో స్లాటెడ్‌ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

tirupati
tirupati
author img

By

Published : Apr 13, 2022, 4:41 AM IST

Updated : Apr 13, 2022, 10:00 AM IST

తిరుపతికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్సులలో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఊపిరాడక విలవిల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. వారిని 108లలో ఆస్పత్రులకు తరలించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం... అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. సాధారణ రోజుల కంటే వేసవిలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువ. కొవిడ్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల రద్దీ మరింత పెరిగింది. ఇదంతా తెలిసీ తితిదే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా, తీరిగ్గా ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తరగక సహనం కోల్పోయిన భక్తులు తోసుకురావడంతో... తితిదే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.

రెండు రోజులుగా వేచి ఉన్నారని తెలిసినా..
తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత దర్శన టోకెన్లు జారీచేస్తున్నారు. సాధారణ రోజుల్లో 30వేల టోకెన్లు, వారాంతాల్లో 40 వేలు ఇస్తున్నారు. సాధారణంగా రేపటి దర్శనానికి ముందురోజు టోకెన్లు ఇస్తున్నారు. ఒక్కోసారి భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటే... ఎల్లుండి దర్శనానికీ ఈరోజు అర్ధరాత్రి నుంచే టోకెన్లు ఇస్తున్నారు. అలా సోమవారం వరకూ టోకెన్లను శనివారమే ఇచ్చేశారు. ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. ఆ విషయాన్ని తితిదే ప్రకటించినా... విషయం తెలియని చాలామంది భక్తులు ఆది, సోమవారాల్లో తిరుపతికి చేరుకున్నారు. వారంతా టోకెన్లు ఎప్పుడు ఇస్తారా? అని తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌తో పాటు ఇటు గోవిందరాజస్వామి సత్రాల వద్ద వేచి ఉన్నారు. రెండు రోజులపాటు టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం టోకెన్లు జారీ చేస్తారని తెలిసి.. మరింతమంది తిరుపతి వచ్చారు. ఇలా మూడు రోజుల్లో వచ్చిన భక్తులతో తిరుపతి మంగళవారం కిటకిటలాడిపోయింది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం, క్యూలైన్లు ఎంతకూ తరగకపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ప్రవేశమార్గం పూర్తిగా కూలిపోయే పరిస్థితికి చేరింది. పోలీసులు తాడు సాయంతో పడిపోతున్న ఆ ప్రవేశమార్గాన్ని నిలబెట్టారు. పోలీసు సిబ్బంది ఆ మార్గం నిలబెట్టకపోయి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకునేది. భక్తులు ఆగ్రహంతో బారికేడ్లు పీకేశారు. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన జాలీల్ని తొలగించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో టోకెన్లు లేకుండానే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఉదయం 11.30 గంటలకు తితిదే ప్రకటించింది. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు బస్సులు, సొంత వాహనాలు, టాక్సీల్లో కొండపైకి వెళ్లారు. మిగతా రెండు కేంద్రాల వద్ద తోపులాట జరగకపోయినా, భక్తుల అవస్థలు మాత్రం అన్నిచోట్లా ఒకేలా ఉన్నాయి.

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గాక తితిదే గత నెల నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లు జారీచేయడం ప్రారంభించింది. టోకెన్ల జారీ విధానం వల్ల కొండపై రద్దీ తగ్గినా, తిరుపతిలో క్యూలైన్లలో టోకెన్ల కోసం వేలకొద్దీ ప్రజలు తోసుకుంటూ గంటల తరబడి నిలబడుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచీ టోకెన్లు జారీచేయాల్సి ఉండగా, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టారు. భక్తులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిసినా, తొక్కిసలాట జరగొచ్చని ఊహించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు. బందోబస్తు కోసం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. తితిదే అధికారుల తీరుపై భÅ¡క్తులు తీవ్రంగా మండిపడ్డారు. కొవిడ్‌ కారణంగా ఎప్పటి నుంచో మొక్కులు తీర్చుకోలేదని, తమను తిరుమలకు అనుమతిస్తే స్వామి దర్శనం దొరక్కపోయినా, కనీసం మొక్కులైనా తీర్చుకుంటామని, తŸలనీలాలు సమర్పించుకోడానికైనా అనుమతించాలని వేడుకున్నారు.

విజిలెన్స్‌ సిబ్బందిపై పోలీసుల ఆగ్రహం
క్యూలైన్లలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, టోకెన్లు లేకుండానే కొండపైకి వెళ్లవచ్చని పోలీసులు భక్తులకు సూచించారు. అలా ప్రకటించవద్దని వారిని తితిదే విజిలెన్స్‌ సిబ్బంది నిరోధించడంతో పోలీసులు వారిపై మండిపడ్డారు. ఎట్టకేలకు 11.30 సమయంలో తితిదేనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, భక్తుల్ని బస్సుల్లోకి ఎక్కించి పంపారు. వాహనాలన్నీ ఒకేసారి రావడంతో ఉదయం 12 గంటల సమయంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ ఏర్పడింది. అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో ఎస్పీఎఫ్‌, పోలీసు సిబ్బంది పలువురిని సప్తగిరి తనిఖీ కేంద్రానికి తరలించి త్వరితగతిన చెకింగ్‌ జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు మొత్తం వాహనాలను క్లియర్‌ చేయగలిగారు. మరోవైపు అటు నడకమార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది.

..

సర్వదర్శన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
టోకెన్ల విధానం తీసేసిన నేపథ్యంలో తిరుమలకు పెద్దసంఖ్యలో చేరుకునే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే అధికారులు చేపట్టారు. కల్యాణకట్టల వద్ద తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్థానిక రాంభగీచా, సుదర్శన్‌ కౌంటర్ల వద్ద అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రం వద్ద భక్తులకు వేగంగా అన్నప్రసాదాలను అందించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్సులోకి భక్తులను అనుమతించి శ్రీవారి దర్శనానికి పంపుతున్న నేపథ్యంలో భక్తుల దర్శనానికి అధిక సమయం తీసుకునే అవకాశం ఉంది. క్యూలైన్‌లోని వారికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.

...
...

ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీతో తోపులాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో తితిదే బుధవారం నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసింది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసి కొవిడ్‌కు పూర్వం ఉన్న విధానాన్ని పునరుద్ధరించింది. భక్తులను స్థానిక లేపాక్షి కూడలిలోని సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతిస్తోంది. మంగళవారం మొదట టోకెన్లు ఉన్నవారిని, వారి తర్వాత టోకెన్లు లేనివారిని కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించారు.

అనూహ్య రద్దీతోనే స్లాటెడ్‌ విధానం రద్దు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో మంగళవారం అనూహ్య రద్దీ నెలకొనడంతో స్లాటెడ్‌ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన అధికారులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, 2లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రద్దీతో 2020కి పూర్వం ఉన్న విధానంలోనే టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి భక్తులను అనుమతించామని తెలిపారు. దర్శనానికి 20-30 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని, తదనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.

ఇదీ చదవండి: భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు, కంపార్టుమెంట్లు.. తోపులాటపై ప్రతిపక్షాలు ఫైర్​

Last Updated : Apr 13, 2022, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.