తిరుమల కనుమ దారిలో జింకను బస్సు ఢీ కొట్టింది. దిగువ కనుమదారిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేగంగా వస్తున్న బస్సు అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా అడ్డువచ్చిన జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెెందింది. కాగా అది చనిపోతూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్పుడే పుట్టిన జింక పిల్లను తిరుమతి జంతుశాలకు తరలించారు. జింక మృతి పట్ల శ్రీవారి భక్తులు, జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆస్తి కోసం క్రూరత్వం- బామ్మను కుక్కతో కరిపించిన మనవడు