ETV Bharat / city

AMITH SHAH: అమిత్‌ షా పర్యటనలో మార్పులు.. సీఎంతో శ్రీవారి దర్శనం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం తిరుపతికి రాగానే నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. సీఎం జగన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు.

amith shah
amith shah
author img

By

Published : Nov 13, 2021, 2:09 PM IST

Updated : Nov 13, 2021, 3:16 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం తిరుపతికి రానున్న అమిత్ షా.. ఆదివారం పలు కార్యక్రమాల తర్వాత సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు మారిన షెడ్యూల్ మేరకు.. ఇవాళ సాయంత్రం తిరుపతికి రాగానే నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. సీఎం జగన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. రాత్రి తాజ్ హోటల్‌లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి హోటల్‌లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

సదరన్​ జోనల్​ కౌన్సిల్​ సమావేశం..

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ ల సమావేశం కోసం తిరుపతి ముస్తాబైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన(southern zonal council meeting at tirupati being attended by central home minister amit shah) 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, ముఖ్య అధికారులు హాజరవుతారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్టానికి చేరుకుంటారు. రేపు జరగనున్న ఈ సమావేశంలో.. రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై చర్చించనున్నారు. మెుత్తంగా.. ఈ సమావేశంలో పాల్గొంటున్న రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరగనుంది.

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా కేంద్ర హోం మంత్రి సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలను 5 జోనల్ కౌన్సిళ్లుగా విభజించి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

ATTRACTIVE CHILDREN HOSPITAL: భలే భలే.. బుజ్జాయిల ఆస్పత్రి

Last Updated : Nov 13, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.