శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జించారని.. ఆ విధంగా వచ్చిన డబ్బును తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. వైకాపా అక్రమాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సీఎం జగన్‌కు లేఖ రాసినా స్పందన లేదని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఇద్దరి పేర్లు, ఊరు,వయసు.. ఒక్కటే ! కానీ..