ETV Bharat / city

Prabhas Donation to AP: సీఎం సహాయనిధికి హీరో ప్రభాస్‌ విరాళం..ఎంతిచ్చాడంటే..? - floods

Prabhas Donation: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్​లు తమ వంతుగా ముఖ్యమంత్రి సహయ నిధికి విరాళం అందించారు. తాజాగా ప్రభాస్ సైతం వరద బాధితుల కోసం రూ.కోటి సహాయం ప్రకటించారు.

సీఎం సహాయనిధికి నటుడు ప్రభాస్‌ విరాళం
సీఎం సహాయనిధికి నటుడు ప్రభాస్‌ విరాళం
author img

By

Published : Dec 7, 2021, 1:09 PM IST

Prabhas Donation to AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని దశాబ్దాలలో చూడని విపత్తును రాష్ట్రం చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. తిరుమల, తిరుపతిని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర సమయంలో బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ విరాళం అందించారు. వీరితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. నిరాశ్రయులకు ఈ డబ్బు కొంతైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సహాయం అందించినట్లు ప్రభాస్ తెలిపారు.

ఇదీచదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.