ETV Bharat / city

TANK RAISED FROM GROUND IN TIRUPATI : తిరుపతిలో వింత .. భూమిలోంచి పైకి వచ్చిన ట్యాంక్​

TANK RAISED FROM GROUND IN TIRUPATI : తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్​.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

TANK RAISED FROM GROUND IN TIRUPATI
భూమిలోంచి పైకి వచ్చిన ట్యాంక్​
author img

By

Published : Nov 26, 2021, 12:06 AM IST

Updated : Nov 26, 2021, 5:39 PM IST

నాలుగు రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్న తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో ఓ వింత చోటుచేసుకుంది. భూమి లోపల పాతిపెట్టిన నీటి ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా భూమి ఉపరితలం పైకి ఎగసి(TANK RAISED FROM GROUND IN TIRUPATI) వచ్చింది. దాదాపు 25 అడుగుల విస్తీర్ణంతో 25 సిమెంట్ ఒరలతో నిర్మించిన నీటి తొట్టె బయటపడటం ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

శుభ్రం చేస్తున్న సమయంలో సిమెంటు ఒరలు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన మహిళ నీటి తొట్టెలో పడిపోయారు. వెంటనే ఆమెను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నీరు ప్రవహించడంతో ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు ఒరలు 18 పైకి ఊబికి వచ్చినట్లు భావిస్తున్నారు.

ఇదీ చదవండి..

Central Team Tour: వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం.. రేపటి నుంచి పర్యటన

Last Updated : Nov 26, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.