తిరుపతి వేదికగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ.. రాత్రి 7 వరకు కొనసాగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. అజెండా సమావేశాలను అంతర్రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రవేశపెట్టగా.. అమిత్ షా ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.
అజెండాలో మొత్తం 26 అంశాలు ఉండగా.. గత సమావేశ నిర్ణయాలకు సంబంధించిన 2 నివేదికలపై చర్చ జరగనుంది. తర్వాతి సమావేశ వేదిక ఖరారు సహా 24 కొత్త అంశాలపై ఈ భేటీలో చర్చ చేపడతారు.
ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే..
- తమిళనాడు - పొన్నుమూడి, ఉన్నత విద్యాశాఖ మంత్రి
- కేరళ - మంత్రి రాజన్, రెవెన్యూ శాఖ
- తెలంగాణ - మహమూద్ అలీ,హోం మంత్రి
- పుదుచ్చేరి - ముఖ్యమంత్రి రంగస్వామి
- కర్ణాటక - ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
- ఏపీ - ముఖ్యమంత్రి జగన్
- పుదుచ్చేరి ఇంఛార్జ్ గవర్నర్ - తమిళసై
- అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ - దేవ్ంద్ర కుమార్ జోషి
- లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ - ప్రఫుల్ పటేల్
ఇదీ చదవండి: మా పాలనలో.. వారంతా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా