ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని... విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు మరిన్ని వసతుల కల్పన అవసరమని పేర్కొన్నారు. ఆనందనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు