Mummidivaram jathara: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో కొలువైన సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ అమ్మవారిని దర్శించుకున్నారు. గత వారంలో ప్రారంభమైన జాతర మహోత్సవంలో చివరి రోజు మేళతాళాలు డప్పులు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
విచిత్ర వేషధారణలు.. కేరళ డప్పు వాయిద్యాలు.. సర్పాలతో విన్యాసాలు వంటి కార్యక్రమాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ జాతరకు కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముమ్మిడివరం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లలో నుంచి జాతరను నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత ఘనంగా నిర్వహించడంతో భారీగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని సేవించుకున్నారు.
ఇదీ చదవండి : Maha Shivaratri: శివరాత్రి వేడుకలకు ముస్తాబైన కోటప్పకొండ