దొడ్ల రంగారెడ్డి వంటి వీరుల స్ఫూర్తితో ఉద్యమించి తెలుగువారి హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు నేల పొట్టి శ్రీరాముల నుంచి దొడ్ల రంగారెడ్డి వరకూ ఎందరో త్యాగధనులను అందించిందని గుర్తు చేశారు.
తెలుగువారి శౌర్యానికి నిలువెత్తు నిదర్శనం దొడ్ల రంగారెడ్డి అని కొనియాడారు. నెల్లూరు జిల్లాలో జమిందారీ కుటుంబంలో జన్మించి భారత వైమానిక దళం పట్ల ఆసక్తితో ఆ విభాగంలో అధికారిగా చేరి, ఆంగ్లేయ సైన్యంతో కలిసి యుద్ధం చేస్తూ శత్రు విమానాన్ని పడగొట్టిన మొదటి భారతీయ పైలట్ రంగారెడ్డి అని గుర్తు చేశారు. అదే యుద్ధంలో 1944 ఫిబ్రవరి 8న తన సహచరులను శత్రుదాడుల నుంచి రక్షించి అమరులయ్యారని గుర్తు చేశారు. అప్పటికి ఆయనకు కేవలం 23 ఏళ్ల వయస్సు మాత్రమేనని అన్నారు.
విధినిర్వహణలో అంకితభావం, స్వార్థరహిత మానవత్వానికి ప్రతీక అయిన దొడ్ల రంగారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ వీరుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్నవాడలో సర్పంచి అభ్యర్థి గృహనిర్భందం