Animal fat oil: జంతువుల కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్న ఓ ఇంటిపై విజిలెన్స్, పుడ్‌సేఫ్టీ అధికారులు దాడి చేశారు. జంతువుల మాంసంతో నూనె తయారు చేస్తున్నారన్న ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన అధికారులు కర్నూలు జిల్లా నంద్యాలలోని నందమూరినగర‌్‌లో అబూబకర్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో జంతువుల మాంసంతో పాటు ప్లాస్టిక్ డబ్బాల్లో నానబెట్టిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. ఈ నూనెను ఏదో ఒక లేబుల్ వేసి నింపే విధంగా ఉన్న ఖాళీ నూనె డబ్బాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ టీచర్ సస్పెండ్.. డీఈవో ఉత్తర్వులు