MLC Anantha babu Chargesheet rejected మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (అనంతబాబు)పై కాకినాడ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం తిరస్కరించింది. ఛార్జిషీట్ అసంపూర్తిగా ఉందనే కారణంతో వెనక్కి పంపింది. ఈ ఏడాది మే 19న దళిత యువకుడు, ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మే 23న పోలీసులు అరెస్టు చేశారు. 90 రోజుల్లోగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయకుంటే నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. ఆయనకు రిమాండ్ విధించి శనివారం నాటికి 90 రోజులు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు దీనిపై స్పందిస్తూ పోలీసులు అనంతబాబు కస్టడీ పిటిషన్ నుంచి ఛార్జిషీట్ వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనంతబాబు మూడోసారి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరగనుంది.
ఇవీ చదవండి: