కాకినాడ మెయిన్ రోడ్డులోని.. రద్దీ ప్రాంతంలో మద్యం దుకాణం పెట్టడంపై తెలుగుదేశం వినూత్న నిరసన తెలిపింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడకు మద్యం దుకాణాలు తెచ్చాడహో అంటూ.. తప్పెట్లు వేయించారు. ఇదేంటని ప్రశ్నిస్తే అందరినీ బెదిరిస్తున్నాడహో అంటూ.. ఎద్దేవా చేశారు. మహిళలు ఎక్కువగా షాపింగ్ చేసే బంగారం, బట్టల దుకాణాలకు సమీపంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్యం దుకాణం తెరిచారని నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వల్ల వినియోగదారులతో పాటు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే దుకాణాన్ని అక్కడి నుంచి తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి