ధర తగ్గింపు అంటూ ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లోని పెట్రోలు బంకులకే పరిమితమైన బోర్డులు.. కడపలోని రెండు బంకుల్లోనూ వెలిశాయి. తమ వద్ద లీటర్‌కు 2 రూపాయలు తక్కువ ధర అని హెచ్‌పీ పెట్రోలు బంక్ ఎదుట బోర్డు పెట్టగా... దీనికి పోటీగా ఎస్సార్ పెట్రోలు బంక్ వాళ్లు లీటర్‌కు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. రాజంపేట వెళ్లే మార్గంలోని ఈ రెండు పెట్రోలు బంక్‌లు పోటీపడటం వినియోగదారులకు కలిసి వస్తోంది.
ఇవీ చదవండి: