ETV Bharat / city

Delivery: కాన్పు చేసిన ఫోటోలను.. ఆ పార్టీ వాట్సప్ గ్రూపులో షేర్ చేసిన వైద్యుడు... - ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు

Doctor shared the delivery photos: వైద్యో నారాయణ హరి అంటారు.. వైద్యుడు దైవంతో సమానం అన్నారు మన పెద్దలు.. వైద్యుడి దగ్గర ఏది దాచకూడదంటారు. అయితే ఆ వైద్యుడు కాన్పు కోసం చ్చిన మహిళ ఫోటోలను ఆరోగ్య శ్రీ యాప్​లో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. ఓ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూప్​లో షేర్ చేశాడు. ఫోటోలు వైరల్ కావడంతో స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విచారణ ప్రారంభించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Doctor shared the delivery photos
న్పు చేసిన ఫోటోలను వాట్సప్ గ్రూపులో షేర్ చేసిన వైద్యుడు
author img

By

Published : Oct 5, 2022, 9:42 AM IST

delivery photos on WhatsApp: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని వైద్య వృత్తికే కళంకం తెచ్చే ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే ఆ సమయంలో తీసిన ఫోటోలు ఓ వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టడం కలకలం రేపింది. గత నెల 24 తేదీన జమ్మలమడుగులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పురిటినొప్పులతో మహిళచేరింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాన్పు చేశారు.

ఆ మహిళ సర్జరీకి సంబంధించిన ఫొటోలను ఆరోగ్యశ్రీ యాప్​లో అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది . అయితే ఫొటోలను ఆరోగ్యశ్రీ యాప్‌లో కాకుండా పొరపాటున జమ్మలమడుగుకు చెందిన వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన కొందరు వెంటనే ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొన్ని గంటలకే ఆ ఫొటోలను గ్రూప్‌ నుంచి తొలగించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలకు అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.