వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎస్పీ రాహుల్ దేవ్ కీలక వివరాలు వెల్లడించారు. రెండ్రోజులుగా 20 మంది సాక్ష్యులును ప్రశ్నించామని తెలిపారు. కేసులో కీలకంగా మారిన లేఖ గురించి ఆధారాలు సేకరించామని చెప్పారు. ఇందులోని చేతిరాత తన తండ్రిదేనని వివేకా కూతురు సునీత అంగీకరించారని వివరించారు. స్పష్టత కోసం లేఖను, వివేకా చేతి రాతతో ఉన్న కొన్ని ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు లేఖ దొరికినా.. తాను వచ్చే వరకు దానిని దాచాలని వివేకా పీఏ కృష్ణారెడ్డికి సునీత కోరినట్లు వెల్లడించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
లేఖలో ఏముంది?
త్వరగా విధులకి రమ్మన్నందుకు తనపై డ్రైవర్ దాడిచేశాడని వివేకా పేరుతో లేఖలో ఉంది. తన డ్రైవర్ని వదిలిపెట్టొద్దని లేఖలో రాసి ఉంది. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చేంతవరకు ఇది ఎవరి రాశారనే విషయంపై స్పష్టత రాదు.
సంబంధిత కథనాలు