ETV Bharat / city

'ఏడాది కాలంగా రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది'

ఏడాది కాలంగా రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్​ తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత మద్యం దుకాణాలు తగ్గించడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గందన్నారు. దశల వారీగా మద్యం నియంత్రణ చాలా తొందరగా చేపడుతున్నట్లు గుంటూరులో తెలియజేశారు.

liquor consumption regulates from the past year says state liquor regulation committee chairman
ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్​ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
author img

By

Published : Jun 24, 2020, 5:15 PM IST

రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నియంత్రణ వేగంగా చేపడుతున్నట్లు మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్​ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాలంగా మద్య నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలపై గుంటూరులో ప్రకటన విడుదల చేశారు.

లాక్​డౌన్​ అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల మద్యం వినియోగం 20 శాతం, బీరు 50 శాతం తగ్గిందని తెలిపారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. మద్యం నియంత్రణలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తున్నామని చెప్పారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారిపై ఎక్సైజ్​ శాఖ కఠిన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

'కరోనా సమయంలో మద్యం విక్రయాల'పై హైకోర్టులో వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.