ETV Bharat / city

'పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం కరోనా పరీక్షలు చేయాలి' - Corona effect on Guntur

గుంటూరు నగరంలోని ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోజూ కరోనా పరీక్షలు చేయాలని... నగర కమిషనర్ చల్లా అనురాధ సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో... పట్టణ ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

నగర కమిషనర్ చల్లా అనురాధ
నగర కమిషనర్ చల్లా అనురాధ
author img

By

Published : Apr 24, 2021, 10:44 PM IST

పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రతిరోజు నమోదు అయ్యే పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరి కాంటాక్ట్స్​కు మరుసటి రోజే పరీక్షలు చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలకు తీసుకున్న శాంపిల్స్, ఏరోజుకి ఆరోజు ల్యాబ్​కి పంపాలని సూచించారు.

పరీక్షలు చేసే సమయంలోనే వారి రిజల్ట్ వచ్చే వరకు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరీక్ష చేయించుకున్న వారి ఫోన్ నంబర్, చిరునామా, సచివాలయం నంబర్ విధిగా సేకరించాలని... లేకుంటే కాంటాక్ట్ ట్రేసింగ్ ఇబ్బంది అవుతుందని వివరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో అమల్లోకి రాత్రి కర్ఫ్యూ.. మినహాయింపు ఎవరికంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.