గుంటూరు మిర్చి యార్డును ఈ నెల 6వ తేదీ వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో రెండు నెలలకు పైగా యార్డును మూసివేశారు. సడలింపుల్లో భాగంగా వారం రోజుల క్రితమే యార్డులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
కమిషన్ ఏజెంట్లు, కూలీలు...రోజు తర్వాత రోజు వచ్చే విధానంలో యార్డులో కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండు రోజులుగా గుంటూరు నగరంలో నమోదైన కేసుల్లో... యార్డు సమీపంలోని మార్కెట్ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్తగా యార్డును మూసివేయాలని నిర్ణయించారు.
మంగళవారం వచ్చిన సరకును మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతించారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మిర్చి యార్డు మూతపడనుంది. పరిస్థితి అనుకూలించిన తర్వాత యార్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి : ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన వాయిదా