ETV Bharat / city

10 గంటలు శ్రమించి... తెగిన శరీర భాగాలను అతికించి

author img

By

Published : Nov 23, 2020, 5:09 AM IST

ప్రత్యర్థుల దాడిలో చేయి, కాలు తెగిన వ్యక్తికి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి వాటిని అతికించారు. 10 గంటలు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు గుంటూరు వైద్యులు.

rare operation in Guntur
rare operation in Guntur

అరుదైన శస్త్ర చికిత్సల్లో గుంటూరు వైద్యులు మరోసారి సత్తా చాటారు. ప్రత్యర్థుల దాడిలో చేయి, కాలు తెగిన వ్యక్తికి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి వాటిని అతికించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి సాగర్ కాలువ వద్ద ఈ నెల 21న రాత్రి తెదేపా మద్దతుదారులు బి.కృష్ణయ్య, జి.వీరాస్వామిలపై అదే గ్రామానికి చెందిన కొందరు మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో కృష్ణయ్య ఎడమ చేయి, కాలు పూర్తిగి తెగిపోయిన దశలో గుంటూరులోని లలితా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు ఆదివారం తీసుకువచ్చారు.

కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఇమ్మిడిశెట్టి మారుతీప్రసాద్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పది గంటలపాటు శ్రమించి ఆయనకు చేతిని, కాలిని అతికించే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అవయవాలను తిరిగి అతికించిన ఘటనల్లో ఇది నాలుగోదని వైద్యుడు మారుతీప్రసాద్ చెప్పారు. తనతోపాటు ప్లాస్టికి సర్జన్ విశ్వనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. బాధితుడు కోలుకుంటున్నారని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.