father sold his child: పిల్లలు లేక చెట్లు, పుట్టకు మొక్కేవారిని మన దేశంలో చాలా మందిని చూస్తుంటాం.. అమ్మ, నాన్న అన్న పిలుపు కోసం పరితపిస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారిని చూస్తుంటాం... అందుకు భిన్నంగా ఆర్థిక పరిస్థితి బాగాలేక అబార్షన్లు, అమ్మకాలు చేయించుకునే వాళ్లను చూశాం.. కానీ చెడు అలవాట్లకు బానిసలుగా మారి పిల్లలను అమ్ముకునే వాళ్లను ఈ సమాజంలో చాలా అరుదుగా చూస్తుంటాం... ఇదిగో ఇదే కోవకు చెందుతాడు గుంటూరు జిల్లా గండాలయపేటకు చెందిన ఓ తండ్రి... కన్న బిడ్డ అనే బంధాన్ని మరిచి పుట్టిన మూడు నెలలకే తల్లిప్రేమకు దూరం చేశాడు. అపై 11 మందికి ఒకరి తర్వాత ఒకరికి విక్రయించాడు.. అసలేం జరిగిందంటే..?
father sold his child: గుంటూరు జిల్లా గండాలయపేటకు చెందిన మనోజ్ దంపతులుకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా... మూడు నెలల క్రితం మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టింది. చంటిపాపను కంటిపాపలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి దురలవాట్లకు బానిసై పాడు పనికి ఒడిగట్టాడు. డబ్బు కోసం పొత్తిళ్లలో పసిపాపను అమ్మేశాడు. ఈనెల 5వ తేదీన తన మూడు నెలల చిన్నారిని పట్టణంలోని ఓ మహిళకు రూ.75 వేలకు విక్రయించాడు. సదరు మహిళ తెలంగాణలోని నల్గొండ జిల్లా కొండప్రోలులోని మరో మహిళకు ఆ బిడ్డను విక్రయించింది.
father sold his child: ఇలా దాదాపుగా ఆ చిన్నారి 11మంది చేతులు మారగా... చివరకు ఏలూరులోని రమేష్ అనే వ్యక్తి రూ.2.5 లక్షలకు శిశువును కొనుగోలు చేశాడు. తమ పాపను కన్నతండ్రే అమ్మేశాడని తెలిసిన ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తన బాధను ఆమె తల్లికి చెప్పుకొంది. ఆగ్రహించిన చిన్నారి అమ్మమ్మ మేరీ వెంటనే మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలలో విచారణ చేపట్టారు. 11మందిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ రాంబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: అమానుషం.. కన్నకూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం